విద్యాధరికి లక్ష పుష్పార్చన
వైభవంగా మూల మహోత్సవం
వర్గల్(గజ్వేల్): చదువుల తల్లి నెలవు వర్గల్ శ్రీవిద్యా సరస్వతి క్షేత్రం శనివారం మూల మహోత్సవ వేడుకలతో అలరారింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం చేశారు. పట్టువస్త్రాలు, పూలమాలికలు, సకలాభరణాలతో కమనీయంగా అలంకరించారు. లక్ష పుష్పార్చన, లలితాపారాయణం, సప్తశతీ పారాయణం, చండీహోమం నిర్వహించారు. పూజలు, కుంకుమార్చన జరిపారు. వేడుకలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలి
న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి సంతోష్‌కుమార్
సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా జైలును శనివారం ఆయన సందర్శించారు. ఖైదీల వంట గది, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీలందరికీ న్యాయవాదులు ఉండాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడు సార్లు జైలును సందర్శిస్తారని, అడ్వకేట్స్ లేనివారికి న్యాయ సహాయం అందజేస్తారని తెలిపారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
నిజాంపేట(మెదక్): బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని దుబ్బాక ఎ మ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు శనివారం మండల పరిధిలోని కల్వకుంట పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో కలిశారు. ఈసందర్భంగా వారిని సన్మానించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ చాలా కృషి చేశారని తెలిపారు. ప్రస్తుత పాలక గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అందె కొండల్‌రెడ్డి, వార్డు సభ్యులు మహిపాల్, తిరుపతి, భవాని, పద్మ, రేణుక, శ్యామల, శ్రీనివాస్‌గౌడ్, రాజు, నాగరాజుగౌడ్, భారతమ్మ, కనకరాజు, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
పోటీ పరీక్షలతో
విద్యార్థులకు మేలు
టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు
విద్యాధరికి లక్ష పుష్పార్చన
విద్యాధరికి లక్ష పుష్పార్చన
విద్యాధరికి లక్ష పుష్పార్చన


