చెక్‌ ‘పవర్‌’తోనే క్రేజ్‌..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవితో పాటు ఉపసర్పంచ్‌ పదవికి కూడా ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. వివరాలు 10లో u | - | Sakshi
Sakshi News home page

చెక్‌ ‘పవర్‌’తోనే క్రేజ్‌..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవితో పాటు ఉపసర్పంచ్‌ పదవికి కూడా ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. వివరాలు 10లో u

Dec 21 2025 7:05 AM | Updated on Dec 21 2025 7:05 AM

చెక్‌

చెక్‌ ‘పవర్‌’తోనే క్రేజ్‌..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్

చెక్‌ ‘పవర్‌’తోనే క్రేజ్‌..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవితో పాటు ఉపసర్పంచ్‌ పదవికి కూడా ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది. వివరాలు 10లో u

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఇంకా షాక్‌లోనే ఓడిన అభ్యర్థులు

ఒక్కొక్కరు రూ.20 లక్షల నుంచి రూ.60 లక్షలకుపైగా ఖర్చు

పంచాయతీ ఎన్నికల పుణ్యామా.. వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పోటీకోసం చేసిన ఖర్చు తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా? అని ఓటమి అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర ఆంతర్మథనం నెలకొంది. ‘రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే.. తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా.. గెలవకపోతిమి. ఉన్న ఆస్తులు, బంగారం పాయే.. అప్పుల కుప్పాయె’.. అంటూ చాలా కుటుంబాలు కుమిలిపోతున్నాయి.

– దుబ్బాక

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తాకత్‌కు మించి ఖర్చు పెట్టినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. ఉన్న ఆస్తులు పోయి అప్పుల పాలయ్యారు. చాలా మంది ఎన్నికల ఖర్చు కోసం తమ పొలాలు, ప్లాట్లు, ఇళ్లు, బంగారం కుదవపెట్టి(తాకట్టు) అప్పులు తీసుకున్నారు. మరికొందరైతే ఏకంగా ఆస్తులకు రిజిస్ట్రేషన్లే చేసి డబ్బులు తీసుకున్నారు. రూ.50 లక్షలకు పైగా విలువ ఉన్న ప్లాటును, పొలాన్ని కేవలం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలోపే తీసుకొని సేల్‌డీడ్‌లు చేయించిన సంఘటనలు ఉన్నాయి. మరికొందరు తమకు నమ్మకం ఉన్న వారి దగ్గర, తమ బంధువుల వద్ద రూ.లక్షల్లో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టారు. తీరా ఫలితాలు విరుద్ధంగా రావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

పార్టీల నుంచి భరోసా అందక..

ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న అభ్యర్థులకు వారివారి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పెద్దల నుంచి పెద్దగా ధైర్యం, భరోసా కూడా లేకపోవడంతో ఇంకా ఆందోళనకు గురవుతున్నారు.

పోటాపోటీగా ఖర్చు..

పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలు, రాజకీయంగా పలుకుబడి ఉన్న గ్రామాల్లో ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో చాలా మంది అభ్యర్థులు పోటీపడి ఖర్చు చేశారు. చాలా మంది అభ్యర్థులు రూ.20లక్షల నుంచి రూ.50 లక్షలు, రూ.60 లక్షలు, రూ.70 లక్షలు ఇలా ఇంత కంటే ఎక్కువే ఖర్చుపెట్టి ఓడిపోవడం శోచనీయం.

గెలిచిన వారి పరిస్థితీ అంతే!

డిపొయిన సర్పంచ్‌ల పరిస్థితియే కాదు రూ.లక్షలు పెట్టి గెలిచిన సర్పంచ్‌ల పరిస్థితి కూడాదయనీయంగానే తయారైంది. లక్షలు పెట్టి గెలిచాం.. ఈ అప్పులు ఎలా తీర్చాలో ఏం చేద్దామన్న ఆలోచనలతో చాల మంది గెలిచిన సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. ఏదైమెనా ఈ పంచాయతి ఎన్నికలు చాల కుటుంబాలను ఆర్ధికంగా, మానసికంగా కోలుకోలేకుండా చేశాయనే చెప్పవచ్చు.

కుటుంబాల్లో కంటతడి

గెలుస్తామన్న నమ్మకంతో ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి రూ.లక్షల్లో ఖర్చు పెట్టినా గెలవకపోవడంతో చాలా మంది ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థులు, వారి కుటుంబాలు ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నాయి. ‘పైసలు తీసుకుండ్రు.. తాగిండ్రు.. తిన్నరు.. మమ్మల్ని మోసం చేసిండ్రు.. ఈ అప్పులు ఎట్లా తీర్చాలో..’ అంటూ చాలా కుటుంబాలు కంటతడి పెడుతున్నాయి. బంధువులు వచ్చి ధైర్యం చెబుతూ ఓదారుస్తున్న పరిస్థితి చాలా గ్రామాల్లో కనబడుతోంది.

గెలుపు కోసం భూములు,

ప్లాట్లు, బంగారం తాకట్టు

దిక్కుతోచని స్థితిలో

ఓడిన అభ్యర్థుల కుటుంబాలు

చెక్‌ ‘పవర్‌’తోనే క్రేజ్‌..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్1
1/2

చెక్‌ ‘పవర్‌’తోనే క్రేజ్‌..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్

చెక్‌ ‘పవర్‌’తోనే క్రేజ్‌..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్2
2/2

చెక్‌ ‘పవర్‌’తోనే క్రేజ్‌..! పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement