ఒలింపియాడ్‌కు అర్హత సాధించిన విద్యార్థులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఇండియన్ నేషనల్ మ్యాఽథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షకు జిల్లాకు చెందిన అంకం రిషిక్‌తేజ్, బత్తుల శ్రీనయనలు అర్హత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్‌రెడ్డిలు ఒలింపియాడ్‌కు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఒలింపియాడ్ పరీక్షకు అర్హత సాధించిన విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ చదువుతున్నారు.


