‘జీ రామ్ జీ’ బిల్లును రద్దు చేయాల్సిందే
గజ్వేల్‌రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధిని కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరిట తీసుకువచ్చిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సరికాదని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద వీబీ జీ రామ్ జీ బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎల్లయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసే విధంగా వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజివిక మిషన్) ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరైంది కాదని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు బండ్ల స్వామి, ప్రవీణ్, రాజగోపాల్, నర్సింలు, రమేష్, శ్రీను, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


