అందుబాటులో ఉండి సేవలందించండి
చేర్యాల(సిద్దిపేట): గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన నాలుగు మండలాల బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ఓడి పోయిన వారు నిరుత్సాహపడొద్దన్నారు. ప్రజా సేవలో ఉన్నవారికి ఎప్పుడైనా అవకాశాలు వస్తాయని అన్నారు. ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు కలిగించినా ఎదుర్కొని నిలిచి గెలిచిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలను అభినందించారు. గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాలు కప్పి సన్మానించారు. ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుతున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
గెలుపొందిన సర్పంచ్‌లు,
వార్డు సభ్యులకు సన్మానం


