అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
ములుగు(గజ్వేల్): అగ్ని ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత అని ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్.ఎన్‌ఎస్ శ్రీనిధి అన్నారు. కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్ అగ్నిమాపక కేంద్ర సిబ్బందిచే అగ్ని ప్రమాద నియంత్రణ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆందోళనకు గురికాకుండా ఎలా ఎదుర్కోవాలనేది అవగాహన ఉన్నట్లయితే వాటి నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. అవగాహన కార్యక్రమాలతో అగ్ని ప్రమాదాలు కొంత మేరకై నా నియంత్రించవచ్చని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణ,అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగత్త్రలు, అగ్నిమాపక పరికరాల సురక్షిత వినియోగం, చిన్నపాటి అగ్ని ప్రమాదాలను ప్రారంభ దశలో ఎలా నియంత్రించాలి? అనే అంశాలపై గజ్వేల్ అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా ఇచ్చిన ప్రదర్శనలు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకు, విద్యార్థులకు అవగాహన పెంపొందింపజేశాయి. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ములుగు అటవీ కళాశాల
అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనిధి


