
కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం
దుబ్బాక: పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల అభిప్రాయాల మేరకే డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తామని ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి జ్యోతి రౌటేలా అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్‌గాంధీ నేతృత్వంలో ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అసమర్థ పనితీరును ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేస్తున్నామన్నారు. సిద్దిపేట, మెదక్ డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం తనను కాంగ్రెస్ పెద్దలు నియమించారన్నారు. పూర్తిగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, ఆ తరువాతే డీసీసీ అధ్యక్షుడిని నియమించడం జరుగుతుందన్నారు. ఇందుకోసమే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, పూజల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
దేశంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకువస్తాం
ఏఐసీసీ జిల్లా పరిశీలకురాలు జ్యోతిరౌటేలా
దుబ్బాకలో కార్యకర్తల సమావేశం