
సిద్ధిధాత్రి నమోస్తుతే..
మహిషాసుర మర్దినిగా వర్గల్ అమ్మవారు
వర్గల్(గజ్వేల్): శరన్నవరాత్రోత్సవాలలో తొమ్మిదోరోజు బుధవారం వర్గల్ శ్రీవిద్యా సరస్వతి అమ్మవారు సిద్ధిధాత్రి మహిషాసుర మర్దినిగా దివ్యదర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు ఆలయ మహామండపంలో 108 కలశాలు, 108 శంఖువులు స్థాపన చేశారు. గర్భగుడిలో మూలవిరాట్టుకు మహా కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిషాసుర మర్దినిగా సాక్షాత్కరించిన అమ్మవారిని భక్తజనులు దర్శించుకుని తరించారు.