
దసరా జోష్
దసరా జోరు అంతాఇంతా కాదు.. దసరా అంటేనే చుక్క, ముక్క అనేలా ఉంటుంది. కానీ దసరా పండుగ, గాంధీ జయంతి రెండూ ఒకే రోజున రావడంతో కొందరు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం వైన్స్ షాప్‌లు, చికెన్, మటన్ షాప్‌లు మూసివుంటాయని, ముందస్తుగా బుధవారమే మందు, మాంసాహార ప్రియులు కొనుగోళ్లు చేశారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
రావణ దహనానికి ఏర్పాట్లు పూర్తి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దసర పండుగను నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పలు ఆలయాల వద్ద ఉత్సవాలను నిర్వహించనున్నారు. అందుకు గాను ఆలయాల వద్ద రావణ దహనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని రంగథాంపల్లి, నర్సాపూర్, ఇమాంబాద్, లింగారెడ్డిపల్లి, ఎన్సాన్‌పల్లిలలో భారీ రావణ కటౌట్‌లను దహనం చేయనున్నారు.
హరీశ్‌రావు శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆనంద, సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి పండుగను నిర్వహించుకోవాలన్నారు.

దసరా జోష్

దసరా జోష్