
నేడు విజయదశమి ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితం
ఉమ్మడి మెదక్ జిల్లా విభిన్న జీవన సంస్కృతుల సమ్మేళనం. అనేక ఆచారాలు, అలవాట్లతో కూడిన వైవిధ్యమైన ఉమ్మడి జిల్లా. వివిధ వర్గాల ప్రజలు దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దసరా అంటే సరదాలకు, సందళ్లకు మరొక పదం. ఆటపాటలకు ఆలవాలం. ఇంటిల్లిపాదీ నూతన దుస్తులు ధరించి రకరకాల పిండి వంటలు, నాన్‌వెజ్ వంటకాలతో ఆనందంగా గడిపేస్తారు. అంతా కలిసి బ్యాండు మేళాలతో వెళ్లి పాల పిట్టను చూసి విజయోత్సాహంతో కేరింతలు కొడతారు. అక్కడి నుంచి నేరుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. మనుషుల మధ్య కల్మషాలన్నింటినీ కడిగి పారేసి ప్రేమ, ఆత్మీయత, అనురాగాలను పంచిపెట్టే పండుగ దసరా. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితంగా జరిగే వేడుకల కథనాలు కొన్ని..

నేడు విజయదశమి ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితం

నేడు విజయదశమి ఉమ్మడి జిల్లాలో వైవిధ్యభరితం