
మహా సరస్వతి హోమం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో దేవి త్రిరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ అధికారులు, అర్చకులు మహా సరస్వతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మహాపూర్ణాహుతి, విశేషద్రవ్య సమర్పణ, సువాసిని తదితర ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: రఘునందన్‌రావు
దుబ్బాక: అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. బుధవారం సాయంత్రం దుబ్బాక పట్టణంలోని తన స్వగృహంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవనామస్మరణతోనే సర్వసుఖాలు కలుగుతాయన్నా రు. అమ్మవారి కరుణతో మంచి పంటలు పండి రైతులు,ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు.
బీఆర్‌ఎస్ ఢోకా కార్డులను ప్రవేశ పెడతాం
కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీఆర్‌ఎస్ హామీలను నమ్మి రెండుసార్లు అధికారాన్ని కట్టబెడితే ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారో, ఏ విధంగా హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారో అన్నింటిని ప్రతి ఓటరుకు ఢోకా కార్డుల పేరిట పంచుతామని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ ఆన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మీసం నాగరాజు యాదవ్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులూ రెండు సార్లు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రతి దళితుడికి మూడెకరాల భూమి, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతులకు ఉచిత ఎరువులు, ప్రతి పేద దళితులకు దళిత బంధు, తదితర హామీలను విస్మరించిందన్నారు. బీఆర్‌ఎస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ,అభివృద్ధి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కల్లూరి నర్సింహులు, కోరిమి రాజు, మహేందర్‌రెడ్డి, స్వామి , మీసం రాజు, కోడెల నాగరాజు, సురేష్ , కిషన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తనిఖీ
బెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తోటపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ శిబిరాన్ని బుధవారం రాత్రి కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి పొరపాటు జరగకుండా పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మహా సరస్వతి హోమం

మహా సరస్వతి హోమం

మహా సరస్వతి హోమం