
యూకేలో పేరిణి సంతోష్ నృత్య ప్రదర్శనలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఇంగ్లండ్‌లో యూనైటెడ్ కింగ్‌డమ్ (యూకే) తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పేరిణి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నట్లు జిల్లాకు చెందిన ప్రముఖ పేరిణి నాట్యాచార్యుడు, యువకళా రత్న సంతోష్ మంగళవారం తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నృత్య రూపకం, పేరిణి శివతాండవం నృత్య ప్రదర్శనలు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే నెల రోజుల్లో ఐర్లాండ్, స్కాట్‌లాండ్, జర్మనీ, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లలో ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పేరిణి నృత్యంను విదేశీయులు ఇష్టపడుతున్నట్లు సంతోష్ తెలిపారు.