
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ఊరూరా స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. బరిలో నిలిచే ఆశావహులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా సంఘాల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచ్, వార్డుమెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏఏ విడతల్లో జరగనున్నాయో తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు, జెడ్పీటీసీలు 26, ఎంపీటీలు 230 ఉన్నాయి. ఏ మండలం ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయోనని ఆశావహులు ఆసక్తిగా ఉన్నారు. బరిలో నిలిచే నేతలు కసరత్తు షూరు చేశారు. జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
– సాక్షి, సిద్దిపేట
శ్రీదుర్గే.. జయదుర్గే
వర్గల్(గజ్వేల్): శరన్నవరాత్రి ఉత్సవ వైభవంతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం అలరారుతోంది. మంగళవారం అమ్మవారు సకల సద్గతులు ప్రాప్తించే దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచహారతులు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. చదువుల తల్లి సన్నిధిలో చిన్నారుల అక్షరస్వీకారాల సందడి నెలకొంది.
కనకదుర్గ మాతగా..
కొండపాక(గజ్వేల్): మండల పరిధిలోని మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో మంగళవారం తొమ్మివ రోజున అమ్మవారు కనకదుర్గ దేవిగా దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు.

బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025