
నేతల గురి
రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు పరిషత్ మొదటి విడతలో15 మండలాలు మూడు విడతలుగా పంచాయతీ పోలింగ్ మొదటగా 7మండలాలు, రెండోసారి 10, మూడో విడతలో 9 మండలాలు
గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో 7 మండలాలు, 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డుల్లో అక్టోబర్ 31న ఎన్నికలు జరగనున్నాయి. గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాలున్నాయి.
రెండో విడతలో 10 మండలాలు 182 గ్రామ పంచాయతీలు, 1,644 వార్డులలో ఎన్నికలు నవంబర్ 4న నిర్వహించనున్నారు. నంగునూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నారయణరావుపేట, మిరుదొడ్డి, బెజ్జంకి, తొగుట, అక్బర్‌పేట–భూంపల్లి, దుబ్బాక మండలాలు ఉన్నాయి.
మూడో విడతలో 9 మండలాలు 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డుల్లో నవంబర్ 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. హుస్నాబాద్, అక్కన్నపేట, దూల్మిట్ట, కోహెడ, మద్దూరు, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, చేర్యాల మండలాలున్నాయి.
స్థానిక బరి..
ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంతో జిల్లాలో ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి.
– మొదటి విడతలో 15 మండలాల్లో 15 జెడ్పీటీసీలు, 125 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావు పేట, చిన్నకోడూరు. నంగునూరు, దుబ్బాక, అక్బర్‌పేట–భూంపల్లి, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట, చేర్యాల, కొమురవెల్లి, రాయపోలు, దూల్మిట్ట, మద్దూరు మండలాలు ఉన్నాయి.
పట్టు కోసం కసరత్తు
బరిలో నిలిచే అశావహులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏ విడతలో ఏ గ్రామంలో ఎన్నికలు జరగనున్నాయో తేలడంతో అశావహులు ఇప్పటికే కార్యకర్తలు, యువజన, మహిళా, కుల సంఘాల నేతలతో సమావేశాలవుతున్నారు. తనకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇప్పటికే పల్లెలో తిరుగుతూ పట్టును మరింత పెంచుకుంటున్నారు. పల్లెల్లో సందడి నెలకొంది.
ఏర్పాట్లలో ఆశావహులు
మూడు విడతల్లో ‘పంచాయతీ’