
అపురూపం.. అమ్మరూపం
అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం అమ్మవారిని అన్నపూర్ణా దేవిగా అలంకరించారు. మండపాల వద్ద కుంకుమార్చన, పుష్పార్చన, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దివ్య దర్శనమిచ్చారు. వర్గల్‌తోపాటు జిల్లా కేంద్రంలోనిసంతోషిమాత ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయాలలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆయా ప్రాంతాలు మార్మోగాయి.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/వర్గల్(గజ్వేల్)

అపురూపం.. అమ్మరూపం