
విద్యాధరి సేవలో ఎమ్మెల్సీ కవిత
వర్గల్(గజ్వేల్): కంచి పీఠం, కంచి స్వామి ఆశీస్సులతో వేదోక్తంగా, శాస్త్రోక్తంగా కొనసాగుతున్న అద్భుత పూజాకార్యక్రమాలతో రాష్ట్రానికి వర్గల్ క్షేత్రం ఆశీర్వాదమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి శేషవస్త్రం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో వర్గల్ అమ్మవారిని దర్శించుకోవాలనే సంకల్పం నెరవేరిందన్నారు. అమ్మ ఆశీస్సులతో రాష్ట్రంలో ఆడపిల్లలు అందరూ విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. ఆమె వెంట నాచగిరి ఆలయ మాజీ చైర్మన్, లీగల్‌సెల్ రాష్ట్ర నాయకులు కొట్టాల యాదగిరి తదితరులున్నారు.