
విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలి
హుస్నాబాద్: ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లో వేర్వేరుగా జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ ఆకృతిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్లు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ అనేది యువతను సమాజానికి దగ్గర చేసే వేదిక అని అన్నారు. ప్రతి విద్యార్ధి సేవా భావంతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విద్యలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలోనూ ముందుకు సాగాలన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో కళాశాల ప్రిన్సిపాల్స్ గంగాధర్, లలిత, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్లు రణధీర్, కరుణాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.