
సమస్యల పరిష్కారంలో అలసత్వం తగదు
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
కొండపాక(గజ్వేల్): రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం చూపవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ హెచ్చరించారు. కుకునూరుపల్లిలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల నమోదు రిజిస్టరును, ఆన్‌లైన్ నమోదు తీరులను పరిశీలించారు. ఈసందర్భంగా హమీద్ మాట్లా డుతూ త్వరలో భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై ప్రభుత్వం పరిష్కార దిశగా ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. సాదా బైనామాల సమస్యల పరిష్కారం విషయంలో చేసుకున్న దరఖాస్తులను పరిష్కారించే దిశగా స్పష్టమైన ప్రకటన రానుందన్నారు. అందుకు అనుగుణంగా సిద్దంగా ఉండాలన్నారు. రెవెన్యూ పరమైన సమస్యలు పేరుకుపోకుండా చూసుకోవాలన్నారు.