
పంటకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు
సిద్దిపేటజోన్: ఆయిల్‌పామ్ సాగుకు మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఇటీవల ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్‌పామ్‌కు అనుసంధానంగా కోకో, వక్క పంట సాగును అధ్యయనం చేసిన రైతులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం జరిగిందని, నాలుగేళ్ల కష్టం ఫలితాలు మీకళ్ల ఎదుటే ఉందన్నారు. ఆయిల్ పామ్ రైతులుగా ఉన్న అనుభవాన్ని ఇతర రైతులకు అవగాహన కల్పించి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగులో అంతర పంటగా కోకో సాగుకు ఎకరాకు రూ.12 వేలు రాయితీ ఉందన్నారు. అదనంగా రూ. 80 వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోకో పంట ఎంతో లాభదాయకంగా ఉందన్నారు. ఇది ఆయిల్‌పామ్ సాగుకు ముందడుగు లాంటిదని అభివర్ణించారు. రైతులకు మేలు చేసే దిశగా ఆయిల్‌పామ్ సాగు విస్తరణ పెరిగేలా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం 28 శాతాన్ని 18శాతానికి తగ్గించిందని, దీనిపై పోరాటం చేస్తామన్నారు.
ఆయిల్‌పామ్‌తో పాటు అంతర పంటల సాగుకు మొగ్గుచూపాలి
సహచర రైతులకు అవగాహన కల్పించాలి
రైతులతో ఎమ్మెల్యే హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్