
కొనసాగుతున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు
సిద్దిపేట ఎడ్యుకేషన్: డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో గురువారం స్పాట్ అడ్మిషన్ల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా శుక్రవారం కూడా ఈ స్పాట్ అడ్మిషన్లు కొనసాగనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఈ నెల 20న దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. స్పాట్ అడ్మిషన్‌లో పాల్గొనే విద్యార్థులు రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు.
ఉద్యాన శాఖ అధికారి రమేశ్
దుబ్బాక: ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు చాలా ప్రయోజనాలు ఉంటాయని ఉద్యాన శాఖ అధికారి రమేశ్ అన్నారు. గురువారం పెద్దగుండవెల్లిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతు రవి వ్యవసాయ భూమిలో రెండు ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏడీఏ మల్లయ్య, ఏఈఓ సంధ్య, పంచాయతీ సెక్రటరీ మరళీ, రైతులు ఉన్నారు.
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయుడే మార్గదర్శకుడని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రామంచ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం అబ్దుల్ షరీఫ్ ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఉపాధ్యాయులకు తమ ఉద్యోగ జీవితంలో తరగని ఆస్తి వారి వద్ద చదువుకున్న విద్యార్థులేనన్నారు. సమావేశంలో జీడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎంఈఓ యాదవరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వర్గల్(గజ్వేల్): గౌరారంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను గురువారం ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పరామర్శించారు. రెండు నెలల వ్యవధిలో తల్లి కవిత, అమ్మమ్మ భారతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఇటీవల అనారోగ్యంతో తండ్రి మంజునాథ్ మృతిచెందడంతో పదమూడేళ్లలోపు ఉన్న నయనిక, అక్షయ్ అనాథలుగా మిగిలారు. పిల్లల దయనీయ పరిస్థితి తెలిసి చిన్నారులను పరామర్శించారు. రూ.30,000 ఆర్థికసాయం అందజేశారు. బీఆర్‌ఎస్ పార్టీ తరపున భవిష్యత్‌లో అండగా ఉంటామని పిల్లలకు భరోసా కల్పించారు.
సిద్దిపేటకమాన్: మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మత్తు పదార్థాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలపాలన్నారు.

కొనసాగుతున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు

కొనసాగుతున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు

కొనసాగుతున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్లు