
దంచికొట్టిన వాన
గజ్వేల్: భారీ వర్షాలు కురవడంతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మరోసారి మత్తడి దూకుతోంది. ఫలితంగా ఆ వరదనీరంతా పార్ధివేశ్వరాలయం రోడ్డువైపు నుంచి ప్రధాన రోడ్డుపైకి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గురువారం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్డుపై ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో బంకులో లావాదేవీలు నిలిపేశారు.
మళ్లీ జలదిగ్బంధంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ రోడ్డు