
నిబద్ధతతో పనిచేస్తేనే గుర్తింపు
ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలలో ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిబద్ధత కల్గి ఉండాలని ఎస్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి) డైరెక్టర్ గాజర్ల రమేశ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్‌లో నిర్వహించిన విద్యాశాఖ అధికారుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో గాజర్ల రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో సుమారు 15 అంశాలపై సమీక్ష నిర్వహించి, జిల్లా విద్యాధికారి, కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులకు, గాజర్ల రమేశ్ సూచనలు ఇచ్చారు. కొండపాక మండల పరిధిలోని సిరిసినగండ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల కనీస సామర్థ్యాలు, ప్రతిభను పెంచుతున్న తీరును ప్రశంసించి సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.