
యూరియా కొరత లేదు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
జగదేవ్‌పూర్(గజ్వేల్): రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతులకు పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జగదేవ్‌పూర్ మండలంలో 50 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, విడతల వారీగా పంపిణీ చేస్తామన్నారు.ప్రతి రైతుకూ యూరియా అందుతుందన్నారు.