రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించండి | - | Sakshi
Sakshi News home page

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించండి

Sep 16 2025 8:32 AM | Updated on Sep 16 2025 8:32 AM

రైల్వ

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించండి

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించండి కరీంనగర్‌లో విలీనం చేయండి అంగన్‌వాడీలోనే ప్రీ ప్రైమరీ నిర్వహించాలి పర్యావరణ రక్షణ అందరి బాధ్యత

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి

మంత్రి పొన్నం లేఖ

హుస్నాబాద్‌: పట్టణంలోని సబ్‌ పోస్టాఫీస్‌లో రైల్వే టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని పునరుద్ధరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేఖ రాశారు. రైలు టికెట్లు బుక్‌ చేసుకోవడానికి మంచి సదుపాయం ఉండేదని, ఈ కౌంటర్‌ మూసివేయడంతో అందరికీ అసౌకర్యంగా మారిందన్నారు. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, పోస్టల్‌ శాఖలోని సంబంధిత అధికారులతో చర్చించి కేంద్రాన్ని త్వరగా పునరుద్ధరించాలని మంత్రి పొన్నం లేఖలో విజ్ఞప్తి చేశారు.

హుస్నాబాద్‌లో బీజేపీ రాస్తారోకో

హుస్నాబాద్‌: పట్టణాన్ని కరీంనగర్‌ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అశాసీ్త్రయంగా హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలిపిందన్నారు. ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దాదాపు 20 నెలలు దాటుతున్నా విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంపత్‌ నాయక్‌, నాయకులు శ్రీనివాస్‌, సతీష్‌, రాజేంద్ర ప్రసాద్‌, బొల్లి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

మంత్రి కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా

హుస్నాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌ వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హుస్నాబాద్‌లోని మంత్రి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రవికుమార్‌ మాట్లాడుతూ పోటీ సెంటర్లను ప్రారంభించి అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేయాలనే కుట్ర పన్నుతున్నారని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లకే ప్రీ ప్రైమరీ విద్యను అప్పగించాలన్నారు. అనంతరం మంత్రి పీఏకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు జి.పద్మ తదితరులు ఉన్నారు.

సిద్దిపేటరూరల్‌: మొక్కలను విరివిగా పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పర్యావరణ ప్రేమికుడు, నవ సమాజ నిర్మాణ సమితి జాతీయ అధ్యక్షుడు లక్కరసు ప్రభాకర్‌ వర్మ అన్నారు. సోమవారం రావురూకుల మాజీ ఎంపీపీ గన్నమనేని శ్రీదేవి చందర్‌ రావుతో కలిసి విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ వర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా 10 లక్షల విత్తన బంతులు తయారుచేసి, రోడ్ల వెంబడి, గుట్టలపైన అడవుల్లో చల్లుతున్నామన్నారు. దీని ద్వారా చెట్ల పెంపకానికి దోహదం చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నట్లు తెలిపారు. ఎవరికై నా విత్తన బంతులు కావాలంటే ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. విత్తన బంతులలో ముఖ్యంగా మర్రి, మారేడు, వేప, రావి, జువ్వి, చింత, ఉసిరి, సీమసింత, మామిడి లాంటివి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ మామిళ్ల ఐలయ్య యాదవు, లింగాయత్‌ సమాజం జిల్లా అధ్యక్షులు ప్రశాంత్‌, యాదవ సంఘం జిల్లా యూత్‌ అధ్యక్షుడు రాము యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించండి 
1
1/2

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించండి

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించండి 
2
2/2

రైల్వే టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ను పునరుద్ధరించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement