
రోడ్డెక్కిన రైతులు
జగదేవ్‌పూర్(గజ్వేల్)/హుస్నాబాద్‌రూరల్/మద్దూరు(హుస్నాబాద్): యూరియా కోసం రైతుల అరిగోస వీడటంలేదు. సోమవారం పలు ప్రాంతాల్లో బారులు తీరారు. యూరియా అందకపోవడంతో కొన్ని చోట్ల ఆందోళనకు దిగారు. జగదేవ్‌పూర్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదను దాటుతున్నా పంటకు యూరియా వేయకపోవంతో ఎదుగుదల ఆగిపోతున్నదని వాపోయారు. ధర్నాకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు పలికారు.
– హుస్నాబాద్‌లో యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహించి ఎరువుల దుకాణం ఎదుట బైఠాయించారు. దుకాణ యజమాని యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించారని మండిపడ్డారు. యజమానిపై చర్యలు తీసుకుని షాప్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఓ వచ్చి నచ్చజెప్పినా వినిపించుకోలేదు, యజమానికి సోకాజ్ నోటీస్ జారీ చేస్తానని, విశాల పరపతి సంఘంలో ఎరువులు ఇప్పిస్తానని చెప్పడంతో రైతులు ఆందోళనను విరమించారు.
– మద్దూరు రైతువేదిక, పీఏసీఎస్ సొసైటీల వద్ద రైతులు పడిగాపులు కాశారు. బస్తా యూరియా కోసం రోజంతా నిరీక్షించాల్సి వచ్చిందని రైతులు వాపోయారు.
తీరని యూరియా వెతలు

రోడ్డెక్కిన రైతులు

రోడ్డెక్కిన రైతులు