
వంటేరు వజ్రమ్మకు నివాళి
వజ్రమ్మకు నివాళులర్పిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తల్లి వజ్రమ్మకు ఘన నివాళులర్పించారు. ఆదివారం జగదేవ్‌పూర్‌లో పదకొండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, మాణిక్‌రావు, జనార్దన్‌రెడ్డి, పద్మాదేవేంద్‌రెడ్డి తదితరులు వజ్రమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల మాజీ ప్రతినిధులు, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు, పార్టీ జిల్లా నేతలు పెద్ద సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. అలాగే శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు వజ్రమ్మ చిత్రాన్ని సబ్బు బిళ్లపై అద్భుతంగా చిత్రించి ప్రతాప్‌రెడ్డికి అందించారు.
శ్రద్ధాంజలి ఘటించిన
మాజీ మంత్రులు, పలువురు నేతలు