
నాణ్యమైన భోజనం అందించండి
● కలెక్టర్ హైమావతి ● రాఘవాపూర్ కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి కేజీబీవీ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం మండల పరిధిలోని రాఘవాపూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం, తరగతులను గూర్చి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట సీసీ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.