
ప్రవక్త జీవితం ఆదర్శనీయం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రవక్త ప్రవచనాలు విశ్వశాంతికి మార్గదర్శకాలని ముస్లిం మత పెద్దలు ముఫ్తి ఆసిఫ్, కరీం పటేల్‌లు అన్నారు. మిలాద్ ఉన్ నబి పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేటలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త కారణ జన్ముడని ఆయన చూపిన బాటలో పయణిస్తే జీవితం సుఖ శాంతులతో ఉంటుందన్నారు. ప్రవక్త జీవితం మొత్తం మానవాళికి ఆదర్శప్రాయమని కొనియాడారు. మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన ఘనత మహమ్మద్ ప్రవక్త దేనన్నారు. తల్లి దండ్రులను మనం ప్రేమిస్తే జీవితం సఫలమైనట్టేనని ప్రవక్త తెలిపారన్నారు. ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గంగా జమున తహజీబ్‌గా ప్రజలందరం కలిసి ఉండాలని సూచించారు. అనంతరం సిద్దిపేట ఏసీపీ రవీందర్ మాట్లాడుతూ ర్యాలీని నిర్వహకులు శాంతియుతంగా నిర్వహించారని కొనియాడారు.
సిద్దిపేటలో మిలాద్ ఉన్ నబి శాంతి ర్యాలీ