
ఇందిరమ్మ ఇళ్ల వేగం పెంచాలి
హుస్నాబాద్‌రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తోటపల్లిలో ఇందిరమ్మ లబ్ధిదారుడు గూళ్ల లింగం,లావణ్య దంపతుల గృహ ప్రవేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని చాలా మంది గృహ ప్రవేశాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం పేదల సొంతింటి కల నేరవేర్చుతోందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
తోటపల్లిలో గృహప్రవేశం