
యూరియా కొరతకు కేంద్రమే కారణం
● కామారెడ్డి సభతో సత్తా చాటుదాం ● డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం తెస్తే అది జరగకుండా కేంద్రంలో బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో హాజరై సత్తా చాటుదామన్నారు.