
బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు
సిద్దిపేటరూరల్: స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయానికి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు వచ్చినట్లు ఆలయ చైర్మన్ కరుణాకర్, ఈఓ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నారాయణరావుపేట శివారులోని స్వయంభూ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయ హుండీ కానుకలను దేవాదాయ, పోలీసుల సమక్షంలో లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో రూ.1,70,293 సమర్పించుకున్నారన్నారు. ఈ డబ్బును దేవాదాయ శాఖ ఖాతాలో జమ చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, చైర్మన్ కరుణాకర్, డైరెక్టర్లు శ్రీనివాస్, ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
‘భూ భారతి’ సమస్యలు
పరిష్కరించండి
● అలసత్వం చూపితే చర్యలు
● కలెక్టర్ హైమావతి
కొండపాక(గజ్వేల్): భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. కొండపాకలోని సమీకృత కార్యాలయం భవనాన్ని బుధవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ భూ హక్కుల పరిరక్షణ కోసం భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరైన వారు నిర్మాణాల విషయాల్లో జాప్యం చేస్తే నోటీస్ అందించి మరొకరి పేరిట మంజూరు కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచుతూ పారదర్శకత లోపించకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ సురేశ్, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాగి జావ ఆరోగ్యానికి మేలు
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాగి జావ ఆరోగ్యానికి మేలు చేస్తుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం పాఠశాల ప్రారంభం కాగానే రాగిజావ పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిఽధి మహదేవ్ నరేష్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మహిళల భాగస్వామ్యం భేష్
ఇర్కోడ్‌ను సందర్శించిన
ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు

బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు

బుగ్గరాజేశ్వరుడి హుండీ ఆదాయం రూ.1.70లక్షలు