
హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపాలి
అక్కన్నపేట(హుస్నాబాద్): హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్‌లో కలపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్‌లో కలుపుతామని మాట ఇచ్చి తప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గ్రామాల్లో అడ్డుకుంటామని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లో హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారన్నారు. నేడు మాట ఎత్తడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.