
పల్లెలకు వెలుగులు: మంత్రి పొన్నం
హుస్నాబాద్‌రూరల్: పల్లెల్లో సెంటర్ లైటింగ్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం రాత్రి పందిల్ల, పోతారం (ఎస్) గ్రామాల్లో జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్స్‌ను కలెక్టర్ హైమావతితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్‌ను విద్య, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిరీమా ఆగర్వాల్, జిల్లా గ్రంథాల చైర్మన్ లింగమూర్తి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.