
మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్
దుబ్బాక: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ హైమావతి, జిల్లా జడ్జి సాయి రమాదేవి తెలిపారు. మంగళవారం సాయంత్రం దుబ్బాకలో కోర్టుకాంప్లెక్స్ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కోర్టు ప్రాంతంలోనే జడ్జి క్వార్టర్స్ ఉండేలా చూడాలన్నారు. పాత తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, సర్వే అధికారులు సర్వేచేసి ప్రభుత్వ భూమి సేకరించాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు అన్ని సౌకర్యాలతో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి డిజైన్ రూపొందించాలన్నారు. అతి త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, ఆర్డీవో సదానందం, రెవెన్యూ, కోర్టు, సర్వే, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు.
త్వరలోనే నిర్మాణానికి శంకుస్థాపన
కలెక్టర్ హైమావతి,
జిల్లా జడ్జి సాయిరమాదేవి
దుబ్బాకలో స్థల పరిశీలన