
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డిలు క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలను సమానంగా చూడాలన్నారు. ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయిస్తే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సెల్‌ఫోన్‌కు బానిసలవ్వరాదని, సెల్‌ఫోన్‌కు కేటాయించే సమయాన్ని క్రీడలకు కేటాయించాలన్నారు. జిల్లా స్థాయిలో రాణించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యి, జిల్లాకు పతకాలు తీసుకురావాలన్నారు.
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
అట్టహాసంగా జిల్లా క్రీడాపోటీలు షురూ..