
యూరియా పక్కదారి పట్టిస్తే చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
కొమురవెల్లి(సిద్దిపేట): యూరియాను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి హెచ్చరించారు. మంగళవారం మర్రిముచ్చాల రైతు వేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీకి ఏర్పాటు చేసిన అదనపు కౌంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు కావాల్సినంత యూరియా అందిస్తామన్నారు. కొందరు ప్రయివేటు డీలర్లు యూరియా పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం ఉందని, వారిపై వారిపై కఠినచర్యలు తీసుకోవడమే కాకుండా వారి లైసెన్సు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఆత్మ కమిటీ డైరెక్టర్ జంగని రవి తదితరులు పాల్గొన్నారు.