
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
వైద్యశాఖ అదనపు డైరెక్టర్ అమర్‌సింగ్‌నాయక్
జగదేవ్‌పూర్(గజ్వేల్): వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు ప్రబలవని మలేరియా విభాగ అదనపు డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ అన్నారు. సోమవారం తిమ్మాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి నీటి తొట్టెలను, నీటి కుళాయిలను, పరిసరాలను పరిశీలించారు. నీటినిల్వలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నందున ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశుభ్రత లోపిస్తే దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.
రక్తపరీక్షల ఫలితాలను త్వరగా అందజేయాలి
సిద్దిపేటకమాన్: పీహెచ్‌సీలలో రోగుల నుంచి సేకరిస్తున్న బ్లడ్ శాంపిల్స్‌ను టీహబ్‌లో పరీక్షలు నిర్వహించి త్వరగా ఫలితాలను అందజేయాలని మలేరియా విభాగ అదనపు డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని టీహబ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..టీహాబ్‌లో అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని అన్నారు.