కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి జోన్: ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగు నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపాతం తక్కువగా ఉండటంతో భూగర్భజలాల లభ్యతలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. సమస్యకు గురయ్యే గ్రామాలు, ఆవాసాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరుల పరిస్థితిని అంచనా వేయాలన్నారు. పస్తుతం ఉన్న బోర్‌వెల్స్, నీటి నిల్వ ట్యాంకులు, పైప్‌లైన్లు, మోటార్ల పనితీరును పరిశీలించి, పనిచేయని వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. సిర్గాపూర్, కంగ్టి, నాగల్‌గిద్ద, రాయికోడ్, వట్‌పల్లి, న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లో తాగునీటి సమస్యకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


