తేనెటీగల పెంపకంతో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

తేనెటీగల పెంపకంతో ఆదాయం

Oct 9 2026 6:48 AM | Updated on Oct 9 2026 6:48 AM

వట్‌పల్లి(అందోల్‌): తేనెటీగల పెంపకంతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సోమేశ్వర రావు అన్నారు. గురువారం అందోల్‌ మండలం, రాంసానిపల్లిలో రైతు పరిపూర్ణ ఏర్పాటు చేసిన తేనెటీగల పెంపకం యూనిట్‌ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేనెటీ గల వల్ల పరపరాగ సంపర్కం జరిగి పంటల దిగుబడి 20 నుంచి 30 శాతం వరకు పెరుగుతుందని తెలిపారు. స్వచ్ఛమైన తేనె ఉత్పత్తితో పాటు మైనం, రాయల్‌ జెల్లీ వంటి ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులకు వివరించారు. ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల ఉద్యాన అధికారి సమత, రైతులు, తేనెటీగల పెంపకందారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement