డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్‌! | - | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్‌!

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతుల నిరసన

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతుల నిరసన

కల్హేర్‌(నారాయణఖేడ్‌): భూమి రిజిస్ట్రేషన్‌, పట్టా మార్పిడికి డబ్బులిస్తేనే పనులు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. బుధవారం నిజాంపేట్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. భూభారతి ద్వారా భూమి రిజిస్ట్రేషన్‌, పౌతి పట్టా మార్పుకు డబ్బులిస్తేనే పనులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేకుంటే పనులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణఖేడ్‌ ఎస్‌ఐ శ్రీశైలం అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ఈ విషయమై తహసీల్దార్‌ నాగజ్యోతితో ప్రస్తవించగా ఎవరూ డబ్బులు అడగడం లేదని తెలిపారు. లోన్‌ కడితేనే పట్టా చేయాలని బ్యాంకు అధికారులు తెలుపడంతో.. ఓ వ్యక్తి పౌతి పట్టా మార్పు కోసం వస్తే నిబంధనల ప్రకారం ఆపామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement