అమరుల త్యాగాలను వృథా కానివ్వం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలను వృథా కానివ్వం

Sep 17 2026 8:35 AM | Updated on Sep 17 2026 8:35 AM

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్‌

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్‌

మద్దూరు(హుస్నాబాద్‌): బైరాన్‌పల్లి అమరుల త్యాగాలను వృథా కానివ్వమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్‌ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 78వ వారోత్సవాల్లో భాగంగా బుధవారం బైరాన్‌పల్లిలో బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అందె అశోక్‌ మాట్లాడుతూ.. దోపిడీకి వ్యతిరేకంగా బైరాన్‌పల్లి ప్రజలు సాగించిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. 118 మంది అమరులైన బైరాన్‌పల్లి నెత్తుటి చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోరాటాన్ని గుర్తించి స్మృతి చిహ్నాలు, అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కన్వీనర్‌ నర్సింహాచారి, మండల కార్యదర్శి యాదగిరి, నాయకులు సంపత్‌, మల్లేశ్‌, ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement