కలెక్టర్‌కు ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇండస్ట్రీయల్ పార్క్ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ నుంచి గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామాన్ని తక్షణం తొలగించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో నిరుపేద రైతులకు అన్యాయం చేయవద్దని అన్నారు. ఈ మేరకు నల్లవల్లి గ్రామ రైతులతో కలిసి మంగళవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను వినతిపత్రం అందజేశారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను పరిశ్రమలకు కేటాయించడం వల్ల తరతరాలుగా భూమినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న రైతు కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సదరు సర్వే నంబర్లను భూసేకరణ గెజిట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.


