జహీరాబాద్: పోక్పో కేసులో నిందితుడు అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం డిమాండ్ చేశారు. మంగళవారం వేర్వేరుగా వారు విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ విచారణ పేరిట నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక బాలికపై డ్రగ్స్, మద్యం ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నా.. పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందించక పోవడం వెనుక ఉన్న మర్మం ఏమిటని ప్రశ్నించారు. తన కొడుకుపై వచ్చిన పోక్సో కేసుపై బండి సంజయ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఆయా మండలాల బీఆర్‌ఎస్ అధ్యక్షులు నారాయణ, వెంకటేశం, రవీందర్, నర్సింహలు, సర్పంచ్ మచ్చేందర్, కౌన్సిలర్ గౌస్ గౌరి, నాయకులు ప్రవీణ్, రాజ్‌కుమార్, జగదీష్, రాజుపటేల్, ఆశంఅలీ పాల్గొన్నారు.
మంత్రి పదవి నుంచి తొలగించాలి
ప్రజా సంఘాల డిమాండ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కో కన్వీనర్ వాణి, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ మంజుల మాట్లాడుతూ.. బాధితురాలు ఫిర్యాదు చేసి మూడు నెలలైనా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే.. బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజేష్, జిల్లా కార్యదర్శి సతీష్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, డీవైఎఫ్‌ఐ నాయకులు దత్తు, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాణిక్‌రావు డిమాండ్


