మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలరేషన్ ఏప్రిల్‌లోనే పూర్తి చేసిన నేపథ్యంలో మళ్లీ జూలై వరకు రేషన్ పంపిణీ ఉండదు. ఒకే సారి 58వేల టన్నుల బియ్యం పంపిణీ చేశారు. రేషన్ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్( ఈ–పీఓఎస్) మెషీన్‌లో 3 నెలల రేషన్ బియ్యం కోసం మూడు మార్లు థంబ్‌ను సేకరించారు. దీంతో రేషన్ బియ్యం పంపిణీ కొంత ఆలస్యమైంది. లబ్ధిదారులు రేషన్ షాప్‌ల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. జూలై నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్పుడు సైతం మూడు నెలల బియ్యం ఒకే సారి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2,041 రేషన్ షాపుల్లో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. మొత్తం 10,18,930 రేషన్ కార్డులు ఉండగా.. 9,25,697 రేషన్ కార్డులకు 58,696.51 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున అందజేశారు. ఈ ఏడాది జనవరిలో 86.35శాతం, ఫిబ్రవరిలో 86.23శాతం.మార్చిలో 87.20శాతం మంది రేషన్ బియ్యాన్ని తీసుకున్నారు.
ఏప్రిల్, మే, జూన్‌లకు సంబంధించి పంపిణీ ఇలా..
జిల్లా మొత్తం కార్డులు తీసుకున్నవారు బియ్యం (టన్నులలో)
మెదక్ 2,40,833 2,08,430 13,140.78
సంగారెడ్డి 4,42,746 4,14,400 27,253.54
సిద్దిపేట 3,35,351 3,02,867 18,300.80


