సంగారెడ్డి జోన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సందర్శించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఓపీఎంఎస్‌లో నమోదు చేసి, వారికి సకాలంలో చెల్లింపులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు. ధాన్యం రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సరైన ప్రణాళికతో కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.
6న జాబ్ మేళా
ఆదర్శ మున్సిపాలిటీగా
తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపాలిటీని ఆదర్శంగా మార్చేందుకు పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. సోమవారం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరిగాయి. కో ఆప్షన్ సభ్యులుగా కుర్మ నగేష్, రేష్మాశెట్టి శంకర్, అఫ్రీన్ మోహిద్, ముంతాజ్ ఖయ్యూంలను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. మున్సిపల్ కమీషనర్ ప్రశాంతి ఎన్నికల ధ్రువపత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కార్, వైస్ చైర్మెన్ శంకర్, కౌన్సిలర్లు ఎన్నికై న వారిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధిలో తనవంతు సహకారం అందిస్తానన్నారు. జెడ్పీ, మండల పరిషత్, మాజీ కో ఆప్షన్ సభ్యులు రషీద్, తాహెర్‌అలీ, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


