బడి తెరిచిన రోజే పుస్తకాలు | - | Sakshi
Sakshi News home page

బడి తెరిచిన రోజే పుస్తకాలు

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

● ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఒక రోజు బడిబాట, రెండో రోజు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించనున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో 5,33,478 పుస్తకాలు అవసరం ఉండగా జిల్లాకు ఇప్పటి వరకు 4,45,110 (83.4శాతం) పుస్తకాలు చేరుకున్నాయి. పాఠశాలలు రీ ఓపెన్‌ రోజుననే విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్‌ యూనిఫాంలు అందించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. జూన్‌ 1వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు గ్రామస్తులు, యువత , ఎన్‌జీఓల సహకారం తీసుకుంటాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ● జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 286, మోడల్‌ స్కూల్స్‌ 14, కేజీబీవీలు 23, వివిధ రకాల రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 40 ఉన్నాయి. వీటిలో 1.30లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ● రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లను ఏర్పాటు చేస్తోంది. మన జిల్లా నుంచి మూడు ప్రాంతాల్లో ఏర్పాటుకు అనుకూలంగా ఉందని నివేదికను పంపించాం. అందులో మర్కూక్‌కు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను మంజూరు చేశాం. దీని కోసం రూ 16.2కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ● ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్‌ క్యాంప్‌లను నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాం. 33 పీఎంశ్రీ స్కూల్స్‌లో సమ్మర్‌ క్యాంప్‌లను నిర్వహిస్తాం. ఇందులో కల్చర్‌ డ్యాన్స్‌, సంగీతం, చేతి రాత, స్పోర్ట్స్‌లలో శిక్షణ ఇస్తాం. త్వరలో తేదీలను ప్రకటిస్తాం.

మర్కూక్‌లో ‘పబ్లిక్‌ స్కూల్‌’ ప్రారంభిస్తాం పీఎంశ్రీ పాఠశాలల్లో త్వరలో సమ్మర్‌ క్యాంప్‌లు ఈ నెల 11 నుంచి పలు కార్యక్రమాలు చేపడతాం సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సాక్షి రిపోర్టర్లుగా ఇంటర్వ్యూ నిర్వహించిన విద్యార్థులు

2025–26 విద్యా సంవత్సరంలో 97.85శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచాం. వచ్చే విద్యాసంవత్సరంలో అందరం కలిసి మరింత టీం వర్క్‌ చేసి 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తాం.

విద్యార్థులు: వచ్చే విద్యా

సంవత్సరానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?

విద్యార్థులు: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి?

విద్యార్థులు: జిల్లాకు తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏమైనా మంజూరు అయ్యాయా?

విద్యార్థులు: ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మర్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారా?

ఇప్పటికే 83% చేరుకున్నాయ్‌

విద్యార్థులు: పదో తరగతిలో విద్యార్థులు

ఎంత మంది ఉత్తీర్ణత సాధించారు?

పాఠశాలలు పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ‘సాక్షి’ రిపోర్టర్లుగా 9వ తరగతి చదువుతున్న రాచకొండ హంసిక, 8వ తరగతి చదువుతున్న రాదారి ఆదర్శ్‌కుమార్‌ వ్యవహరించారు. వీరి ఇంటర్వ్యూలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డిని పలు అంశాలువెల్లడించారు.

– సాక్షి, సిద్దిపేట

Advertisement
 
Advertisement
Advertisement