లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

● ఓవర్‌టెక్‌ చేస్తుండగా ప్రమాదం ● 20 మందికి స్వల్ప గాయాలు ● లకుడారం గ్రామ శివారులో ఘటన

● ఓవర్‌టెక్‌ చేస్తుండగా ప్రమాదం ● 20 మందికి స్వల్ప గాయాలు ● లకుడారం గ్రామ శివారులో ఘటన

కొండపాక(గజ్వేల్‌): ఓవర్‌ టెక్‌ చేయబోయి లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి స్వల్ప గాయాలయ్యా యి. లకుడారం గ్రామ శివారులో రాజీవ్‌ రహ దారిపై సోమవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ నుంచి విత్తనాల సంచులను లారీలో లోడ్‌ చేసుకొని గజ్వేల్‌ రూరల్‌ మండలంలోని కొడకండ్ల శివారులో గల కావేరీ సీడ్స్‌ ఫ్యాక్టరీకి వెళ్తోంది. ఈక్రమంలో ఆర్టీసీ బస్సు కరీంనగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తూ.. ఓవర్‌టెక్‌ చేయబోయి లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ముందు భాగం దెబ్బతిన్నది. దీంతో 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సుల్లో గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. విత్తనాల సంచుల లోడ్‌ లారీ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవరు అఫ్జల్‌ పాషా ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవరు గుర్రం దినేశ్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement