సిద్దిపేటకమాన్: న్యూసెన్స్ కేసులో నిందితుడికి సిద్దిపేట కోర్టు జైలు శిక్ష విధించింది. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణం సాజిద్‌పూరకు చెందిన ఎండీ ఆసీఫ్ వారం రోజుల క్రితం ఇంటి వద్ద న్యూసెన్స్ చేయగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా రెండు సార్లు ఇదే విధంగా ప్రవర్తించగా అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆసీఫ్‌ను కోర్టులో హాజరుపర్చగా సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తి అతడికి రూ.100 జరిమానాతో పాటు పది రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. కానిస్టేబుళ్లు పరశురాములు, కనకరాజు పాల్గొన్నారు.


