ములుగు(గజ్వేల్): ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈ నెల 7వ తేదీన మామిడి ఫలాలవేలం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 11 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనేవారు పాటకు ముందుగానే రూ.5వేల నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో నెగ్గిన వారు మొత్తంలో సగం డబ్బులను నగదుగా చెల్లించాలని, లేకుంటే అతని పాటను రద్దు చేసి రెండో వ్యక్తికి అనుమతిస్తామని చెప్పారు. వేలంలో నెగ్గిన వారు మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతనే పంట కోసేందుకు అనుమతిస్తామని చెప్పారు. మామిడి వేలం కాలపరిమితి జూన్ నెల 15 వరకు ముగుస్తుందన్నారు.


