శతాధిక వృద్ధురాలు మృతి
నంగునూరు(సిద్దిపేట): చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గ్రామస్తులతో ఉన్న వందేళ్ల అనుబంధం నేడు దూరమైంది. శతాధిక వృద్ధురాలు మధురమ్మ(103) శనివారం తెల్లవారు జామున తిమ్మాయిపల్లిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన చల్లారం మధురమ్మ భర్త మరణించడంతో ఎన్నో కష్టాలకు ఓర్చి ఇద్దరు కుమారులు, కూతురిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. కాలక్రమంలో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. మనువళ్లు, మనువరాళ్లు, మునిమనవళ్ల మధ్య వందవ పుట్టిన రోజు జరుపుకొన్న మధురమ్మ మృతి చెందడంపై గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. వందేళ్ల పాటు ఆరోగ్యంగా ఉన్న మధురమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారని వారు కొనియాడారు.


